Friday, March 20, 2026

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి వాహన చోదకుడు నిర్లక్ష్యమే కారణమా..!మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి.. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఏపీ మాజీ సీఎం ఆకాంక్ష..

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 12 ~అన్నమయ్య జిల్లా :-: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేని తెలిసింది. అతివేగంతో పాటు ఆ మార్గం కూడా బస్సు డ్రైవర్ కు కొత్త కావడంతోనే అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిందని తెలుస్తోంది. మృతులంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా ప్రాధమికంగా గుర్తించారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ వృద్ధులేనని తెలిసింది. గాయ పడిన వారిని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాదాపు ఇరవై మందికి పైగానే తీవ్ర గాయాలతో కొట్టు మీడుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక వివరాల్లోకెళ్తే చిత్తూరు జిల్లా నుంచి తీర్థయాత్రలకని వెళ్లిన ప్రయివేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. అల్లూరు సీతారామరాజు జిల్లా లోని అత్యంత ప్రమాదకరమైన ఘాటు రోడ్డు చింతూరు – మారేడుమిల్లి రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రాజు గారి మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. వంకరల రోడ్డు ఆపై పొగమంచు కూడా..____________________________రోడ్డు వంకరలు, పొగమంచు, డ్రైవర్‌ స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని సహాయక సిబ్బంది అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిపి మొత్తం 37 మంది ఉన్నారని వీరిలో ఎక్కువ మందికి కాళ్లు, చేతులు విరిగాయని, కొందరికి తలలు పగిలాయని తెలుస్తోంది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే చింతూరు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో 3 అంబులెన్సులు, 5 పోలీసు వాహనాలతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎనిమిది వాహనాలు అక్కడకు చేరుకుని గాయపడిన క్షతగాత్రులను హుటా హుటిన సంబంధిత ఆసుపత్రులకు తరలించారు. అలాగే మృతదేహాలను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం లోతైన అడవి ప్రాంతం కావడంతో రెస్క్యూ కష్టంగా మారింది. క్రేన్‌లు, వ్యాలీ రెస్క్యూ టీమ్స్ సహాయంతో మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. చిత్తూరు జిల్లాకు చెందిన..________________________________ఈ తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారంతా వృద్ధులేనని అంటున్నారు. దట్టమైన పొగమంచు ఉన్నప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా ఘాట్ రోడ్డులో నడపటం ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని తెలిసింది. స్పాట్ లోనే 9 మంది వరకూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన AP 39 UM 6543 నెంబరు గల విజ్ఞేశ్వర ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సులో తీర్ధయాత్రలకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గాయపడిన వారిలో ఇద్దరి నుండి ఐదు మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన విచారం వ్యక్తం చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం అత్యంత విషాదకరమని వైఎస్‌ జగన్‌ అన్నారు. చింతూరు మండల కేంద్రమైన తులసిపాకలు ఘాటు రోడ్డులో యాత్రికులను తీసుకెళ్తున్న ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి లోయలో పడి పలువురు మృతిచెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని వైయస్ జగన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వైయస్ జగన్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు..~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News