Friday, March 20, 2026

*లలితామాత ఆలయంలో వైభవంగా కుంకుమార్చన*————————————–

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………,……….,………………….జగిత్యాల రూరల్ మండలం పొలాసలో వెలిసిన 108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితామాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన సుహాసినిలు మంగళహారతులను సమర్పించారు. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ఫౌండరి ట్రస్టి చైర్మన్ చెల్లం స్వరూప ఆధ్వర్యంలో విశేష సంఖ్యలో మాతలు పాల్గొని లలితమాత సహస్రనామా పారాయణం గావించి అనంతరం శ్రీ చక్రాలకు సామూహిక కుంకుమ పూజా భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించి అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ లలితా మాత అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల పాత్రికేయులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ట్రస్టి సభ్యులు, ఫౌండర్ ట్రస్టి చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య లు జగిత్యాల జిల్లా పాత్రికేయుల యూనియన్ ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయులు ఎల్లాల రాజేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గాజుల నగేష్లను సన్మానించి తీర్థప్రసాధాలు అందజేసి ఆశీర్వాదించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News