నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 12 ~అన్నమయ్య జిల్లా :-: ఎగువ మాచిరెడ్డిగారిపల్లి మస్జిద్-ఎ- ఫాతిమా లో ప్రత్యేక ప్రార్థనలలో వైసీపీ మదనపల్లి సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పాల్గొన్నారు. ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం నాడు (జుమా) మధ్యాహ్న సమయంలో మసీదులలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు (జుమా నమాజ్) చేయడం ఆనాటి నుంచి ఆనవాయితీగా వస్తా ఉందని వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. మదనపల్లె నియోజకవర్గ పరిధిలోని నిమ్మనపల్లె మండల కేంద్రమైన రాచవేటివారిపల్లె గ్రామ పంచాయితీ లోని ఎగువ మాచిరెడ్డిగారిపల్లె గ్రామంలో గల మస్జిద్ – ఎ – ఫాతిమా లో శుక్రవారం నిస్సార్ అహ్మద్ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. గ్రామ ముస్లిం మైనార్టీ సోదరులు, గ్రామ వైసీపీ శ్రేణులు ఆహ్వానం మేరకు ఎగువ మాచ్చిరెడ్డిగారి పల్లి గ్రామానికి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన నిస్సార్ అహ్మద్ ను పార్టీ ముస్లిం మైనార్టీ సోదరులు, స్దానిక ముస్లిం మత పెద్దలు, వైసీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామ పెద్దలను ఆత్మీయ పలకరింపుతో యోగక్షేమాలు అడిగి విచారిస్తూ గ్రామ మహిళలకు అభివాదం చేస్తూ మసీదు ప్రాంగణం వరకు కాలి బాటన నడిచొచ్చారు. మసీద్ వద్దకు చేరుకోగానే మత పెద్దలు గౌరవ మర్యాదలతో దుశ్శాలువాలు కప్పి, పూల బొకే అందించి మసీదు లోనికి ఆహ్వానించారు. అనంతరం తోటి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనానంతరం మత పెద్దలను ఆప్యాయంగా పలకరించి మసీదు సమస్యలపై ఆరా తీశారు. మసీదు అభివృద్ధికి సహకరిస్తానని మసీదును మరింత అభివృద్ధి చేసుకుందామని ఇందులో పార్టీలకతీతంగా ముందుకు రావాలని దేవుళ్ళ ప్రార్థనల వద్ద పూర్తిగా రాజకీయాలను పక్కనపెట్టి అందరం ఏకమై సహకరించుకుంటూ అభివృద్ధి చేసుకుందామని నిస్సార్ అహ్మద్ చెప్పడంతో తోటి ముస్లిం, మైనార్టీ సోదరులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో కలియ తిరుగుతూ స్దానికులతో మాట్లాడారు. గ్రామ సమస్యపై విచారించారు. గ్రామంలో ఏ సమస్య ఉన్న నేరుగా వచ్చి తనను కలవాలని తక్షణమే పరిష్కారం చేస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి బాషా, ఖాసిం సాబ్, బాషా సాబ్, చైన ఖాన్, రెడ్డి ఖాన్, మురాషా, సయ్యద్ వల్లి, ప్యారు సాబ్, నూర్ మొహిద్దీన్ ఖాన్, ఎన్. నవాజ్ అలీ ఖాన్, సమద్, షానవాజ్, ఫక్రుద్దీన్, సాదిక్, జబివుల్లా, అబ్దుల్లా, యాసిన్, జబివుల్లా, ఫయాజ్, సత్తార్ మరియు ఇతర మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~





