నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 12 ~అన్నమయ్య జిల్లా :-: నెల్లూరు మేయర్ అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో వైసీపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండానే కూటమి పార్టీలు పాండిచ్చేరికి క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టాయని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. టీడీపీ క్యాంప్ రాజకీయాలను చూస్తుంటే వైసీపీ నైతికంగా గెలుపొందినట్లేనని అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నెల్లూరులో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు మాకు 41 మంది కార్పొరేటర్ల బలం ఉందని చెప్పుకుంటూనే ఐదుగురు కార్పొరేటర్లు తిరిగి వైసీపీకి వస్తే వణికిపోతున్నారని పోలీసులను పంపించి కార్పొరేటర్, వారి కుమారుడిని అరెస్ట్ చేయించి తిరుపతి తీసుకెళ్లిపోయారని ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే కార్పొరేటర్లను కూటమి నాయకుల ఇళ్లకు డెలివరీ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు వైసీపీ కార్పొరేటర్ల భార్య, పిల్లలకు ఫోన్లు చేసి బూతులు తిడుతూ గంజాయి కేసులు పెడతామని బెదిరిస్తున్నారని 8 నెలల మేయర్ పదవి కోసం ఇంతలా దిగజారడం సిగ్గు చేటని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో జగనే సీఎం..—————————————–అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో నెల్లూరు మేయర్ పదవికి పోటీ చేసే విషయంలో వైసీపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండానే మమ్మల్ని చూసి కూటమి ప్రభుత్వం వణికిపోతోందని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. అధికారంలో ఉండి కూడా టీడీపీకి చెందిన కార్పొరేటర్లను ప్రతిపక్ష వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని ప్రలోభ పెడుతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీకి కేవలం 11 మంది కార్పొరేటర్లు, టీడీపీకి 41 మంది ఉన్నారని చెప్పుకుంటూనే కార్పొరేటర్లతో క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు అని మండిపడ్డారు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉన్నా వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారన్న నమ్మకం ప్రజల్లో వచ్చింది అని చెప్పుకొచ్చారు. ఆ ప్రజల నమ్మకమే ఇప్పుడు టీడీపీని భయపెడుతోంది. కాబట్టే కార్పొరేటర్లను కాపాడుకోలేక క్యాంప్‌లు, కిడ్నాప్‌లు, సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పోటీ చేయకుండానే వైసీపీ గెలిచింది..——————————————————నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క కార్పొరేటర్ స్థానం కూడా గెలుచుకోలేదు. 54కి 54 స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. సాంకేతికంగా ఆ పార్టీకి ఒక్క కార్పొరేటర్ కూడా లేడు. కూటమి ప్రభుత్వం వచ్చాక మా వారిలో చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కానీ కూటమి పాలన నచ్చక ఏడాదిన్నరకే కొంతమంది కార్పొరేటర్లు తిరిగి వైసీపీకి రావడంతో కూటమి వణికిపోయింది. రూ.10 కోట్లు వర్కులిస్తామని ఆశ పెడుతున్నా కార్పొరేటర్లు ఆ పార్టీలో ఉండకుండా వెనక్కి వచ్చేస్తున్నారు. అధికారంలో ఉండి కూడా కోట్లు ఖర్చు చేసి పాండిచ్చేరికి క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టిందంటే పోటీ చేయకుండానే వైసీపీనే గెలిచిందని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.కార్పొరేటర్లను డెలివరీ చేయడానికా పోలీసులు.. _______________________________________8నెలల పదవీ కాలం మాత్రమే ఉండే మేయర్ పీఠం కోసం పోలీసులను పంపించి అర్ధరాత్రి వేళ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే నీచ స్ధాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరులో రౌడీయిజం, డ్రగ్స్, గంజాయి మాఫియా రాజ్యమేలుతుంటే వారిని అరికట్టాల్సింది పోయి కార్పొరేటర్లను డెలివరీ చేసే కార్యక్రమంలో పోలీసులున్నారంటే శాంతిభద్రతలు ఎంత దారుణంగా పతనమవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. ఇలాంటి పనికి మాలిన విషయాలల్లో తలదూరుస్తున్నారు. కాబట్టే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దేశంలోనే అట్టడుగు స్థాయికి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచిన ఏపీ పోలీస్ వ్యవస్థను, సీఎం చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి వినియోగిస్తూ పూర్తిగా నిర్వీర్యం చేసేశాడని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.పోలీసులను అడ్డంపెట్టుకుని మా కార్పొరేటర్లకు వేధింపులు..___________________________తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరి బయటకొచ్చిన వారిని బలవంతంగా పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అర్ధరాత్రయినా ఎక్కడికి తీసుకెళ్తున్నది చెప్పకుండా వేధించారు. అతడిపై కేసులున్నాయని చెప్పి తీసుకెళ్లిన పోలీసులు కోర్టులో హాజరుపరచకుండా ఉదయాన్ని బలవంతంగా ఒక వీడియో రిలీజ్ చేయించారని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. ‘గురువారం మధ్యాహ్నం తాడేపల్లిలో పీఎస్‌లో సీఐ వేణుగోపాల్ రెడ్డి అరెస్ట్ చేస్తే కనీసం స్టేషన్ కి కూడా తీసుకెళ్లకుండా ఒంగోలులో నెల్లూరు పోలీసులు పట్టాభి, విజయ్ భాస్కర్ రెడ్డికి అర్ధరాత్రి 3.30 గంటలకు అప్పగించి వేధిస్తున్నట్టు కార్పొరేటర్ కొడుకు నాకు ఫోన్ చేసి చెప్పాడు. అక్కడ్నుంచి వారిని తిరుపతికి తీసుకెళ్లారు. ఈ పోలీసులిద్దరి ఫోన్ లొకేషన్ తీస్తే కిడ్నాప్ వ్యవహారం మొత్తం బయటకొస్తుంది. రౌడీలు, పోలీసులను అడ్డం పెట్టుకుని మా కార్పొరేటర్ల కుటుంబాలను వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలోనే ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేశారు. వైయస్ఆర్ సీపీ నాయకులను అక్రమ కేసులు పెట్టి వేధించడం ధ్యేయంగా పనిచేస్తున్నారు. కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం లేదని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు..యానాదుల అవకాశాలను దూరం చేయొద్దు..______`____________________________వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో యానాది కులాన్ని వైఎస్ జగన్ రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్టీలు అనే మానవత్వం కూడా లేకుండా వారిని ఐదేళ్లపాటు పదవిలో కూర్చోనీయకుండా దించడానికి కుట్రలు చేస్తున్నారని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ఇచ్చిన రాజ్యాధికారాన్ని బలవంతంగా లాక్కోవాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. యానాదులకు రాకరాక వచ్చిన అవకాశాన్ని బలవంతంగా లాక్కుంటూ వైసీపీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మంత్రి నారాయణ ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తారనుకోలేదు. 164 మంది సభ్యుల బలమున్న కూటమి నాయకులు నెల్లూరు వైసీపీ కార్పొరేటర్ల భార్య, పిల్లల మీద కూడా గంజాయి కేసులు పెట్టి వేధించే దుస్థితికి దిగజారిపోవడం వైఎస్ జగన్ మళ్లీ రాబోతున్నారన్న భయానికి నిదర్శనం. కనీస సంస్కారం లేకుండా నెల్లూరు టీడీపీ నాయకులు ఆడవారికి ఫోన్లు చేసి తిడుతున్నారు. అవిశ్వాస తీర్మాణం ద్వారా తెలుగుదేశం నాయకులే స్వయంగా తమ కుసంస్కారాన్ని బయటపెట్టుకున్నారని మాజమంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు..~~~~~~~~~~~~~~~~





