Friday, March 20, 2026

అపోలో యూనివర్సిటీలో అంతర్జాతీయదివ్యాంగులదినోత్సవం

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, డిసెంబర్ 12: ది అపోలో యూనివర్శిటీలో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైకాలజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వికలాంగుల హక్కులు, సామాజిక చైతన్యం, సమగ్ర విద్యా వాతావరణ నిర్మాణంపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది.కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్‌గా హాజరైన డాక్టర్‌ షరీఫ్, వికలాంగుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలు, ఆధునిక సాంకేతికత ఆధారిత సహాయక పరికరాలు, విద్యా సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన ఇన్‌క్లూజివ్ పాలసీలను విద్యార్థులకు వివరించారు. వికలాంగులపై ఉన్న అపోహలను తొలగించి, వారికి సమాన అవకాశాలు లభించేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ భాస్కర్ నాయుడు, డా. హసీనా, డా. సుధా, డా. వి. సుబ్రహ్మణ్యం, డా. విజయ్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News