Thursday, March 19, 2026

సర్పంచ్ గా గెలిపించండి…… చనిపోయిన వారికి ఉచితంగా సమాధులు తీపిస్తాకులాలవారీగా బాండ్ పేపర్ కూడా రాసిస్తా….మరికల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బ్యాగరి రవి….

నేటి సాక్షి నారాయణపేట డిసెంబర్ 12,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని మరికల్ గ్రామ సర్పంచ్ గా తనకు అవకాశం కల్పిస్తే చనిపోయిన వారిని సమాధులు ఉచితంగా తీస్తానని మరికల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బ్యాగరి రవి తెలిపారు. శుక్రవారం మరికల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరికల్ గ్రామంలో ఉన్న పలు వార్డు ప్రజలు నాకు ఒక్క అవకాశాన్ని కల్పించాలని ఆయన కోరారు. మరికల్ గ్రామ అభివృద్ధి కోసం ప్రతి వార్డులలో లో ఉన్న ప్రజలు తనకు సహకరించాలని ఆయన కోరారు. మరికల్ గ్రామ ప్రజలు ముందుకు వచ్చి బ్యాట్ గుర్తుకే భారీ మెజార్టీతో ఓట్లు వేయాలని ఆయన కోరారు. తనను గ్రామ సర్పంచ్ గా గ్రామ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే చనిపోయిన వారికి ఉచితంగా పూడ్చివేస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోనన్నారు. అందుకు కులాలవారీగా బాండు పేపర్లు కూడా రాసిస్తానని ఆయన వివరించారు. గ్రామ ప్రజలు దృష్టిలో పెట్టుకొని బ్యాట్ గుర్తుకే ఓటు వేయాలని ఆయన కోరారు. అదేవిధంగా మరికల్ గ్రామ సర్పంచ్ గా సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని ఆయన కోరారు.మరికల్ గ్రామం అభివృద్ధి కోసం తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News