Thursday, March 19, 2026

వైష్ణవి దేవి ఆలయంలో భక్తి శ్రద్ధలతో శుక్రవారం పూజలు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 12 పుంగునూరు నియోజవర్గం చౌడేపల్లి మండలంలోని పుదిపట్ల గ్రామంలో గల స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో మార్గశిర మాసం, అష్టమి తిది, శుక్రవారం సందర్భంగా స్వయంభు శ్రీ వైష్ణవి దేవికి ,అభయాంజనేయ స్వామికి ,నాగభైరవ స్వామికి, ఉదయమే ఆలయ అర్చకురాలు శ్రావణి పంచామృత అభిషేకం చేసి అనంతరం అమ్మవారిని రంగు రంగు పూలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అష్టమి సందర్భంగా నాగ భైరవ స్వామి సన్నిధిలో భక్తులు పంచదీపారాధనలు సమర్పించుకున్నారు. కుజదోషం, సర్పదోషం, వివాహం కాని వారు ,సంతానం లేనివారు, అనారోగ్యంతో ఉన్నవారు నాగభైరవ స్వామికి అష్టమి రోజున పంచదీపారాధన సమర్పించుకుంటారు. చౌడేపల్లి ,పుంగనూరు, మదనపల్లి, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు హైదరాబాదుకు చెందిన శ్రీకాంత్ ,ధర్మపత్ని ఉమామహేశ్వరి ఉభయ దారులుగా వ్యవహరించారు .ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News