Thursday, March 19, 2026

*స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిషేధాజ్ఞలు*

నేటి సాక్షి ప్రతినిధి శంకర్పల్లి న్యూస్ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లోని రాజేంద్రనగర్‌ జోన్‌లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు *రాజేంద్రనగర్‌ జోన్‌ డీసీపీ యోగేష్‌ గౌతమ్‌, ఐపీఎస్‌ తెలిపారు.*డిసెంబర్‌ 14న (ఫేజ్‌–2) జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత (BNSS) సెక్షన్‌ 163 ప్రకారం ఐదుగురికి మించి గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు.*చేవెళ్ల, షాబాద్‌, మొయినాబాద్, మోకిల, శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని మొత్తం 109 పోలింగ్‌ కేంద్రాల వద్ద, పోలింగ్‌ ప్రాంతాలకు 100 మీటర్ల పరిధిలో ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు.*ఫేజ్‌–2కు సంబంధించి డిసెంబర్‌ 13 ఉదయం 5 గంటల నుంచి డిసెంబర్‌ 15 ఉదయం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కాలంలో ప్రజా సమావేశాలు, అక్రమ గుమికూడడం పూర్తిగా నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News