నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండల కేంద్రంలో శుక్రవారం రోజున పుల్లెల లక్ష్మణ్ ఎన్నికల ప్రచారం లో ప్రజలు పుల్లెల లక్ష్మణ్ కు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి పురవీధుల గుండా భారీ ఊరేగింపు తీయడం జరిగింది ఈ సందర్భంగా పుల్లెల లక్ష్మణ్ గతంలో సర్పంచ్ గా ఉన్నప్పుడు నూతన వారసంత వైకుంఠధామ పల్లె ప్రకృతి వనం సిసి రోడ్లు డ్రైనేజీలు గ్రామంలో ప్రతిరోజు రెండు పూటల మంచినీటి సౌకర్యం అదనంగా విద్యుత్ స్తంభాలను అమర్చినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు సహకరించి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.





