Thursday, March 19, 2026

*ప్రతి సమస్యను పరిష్కరిస్తాం* •అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం •24 గంటలు అందుబాటులో క్యాంపు కార్యాలయం •సమస్య పరిష్కారానికి కృషి చేయాలి•నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు•అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే ఏలూరి

నేటి సాక్షి,బాపట్ల జిల్లా (పర్చూరు)ప్రజల ప్రతి సమస్యను పరిష్కరించడమే తమ బాధ్యతని ప్రతి సమస్యను వేగంగా పురస్కరించేందుకు కృషి చేస్తున్నామని, 24 గంటలు తన కార్యాలయం అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఓపికగా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే ఏలూరి వెల్లడించారు. సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, రహదారులు, విద్యుత్‌, సాగునీరు—ప్రతి విభాగంలో స్పష్టమైన కార్యాచరణ తాయారు చేస్తున్నామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం చూపడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తన కార్యాలయం లో ప్రజా సమస్యల పరిష్కారానికి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకొని చర్యలు తీసుకునే విధంగానే ప్రజా దర్బార్ కొనసాగుతుందని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. ప్రజలు ఎప్పుడైనా క్యాంపు కార్యాలయంలో అర్జీలు నేరుగా ఇవ్వవచ్చునని, వెంటనే సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News