Wednesday, March 18, 2026

*మాజీ సైనికుడు అబ్దుల్ రజాక్ జ్ఞాపకార్ధం రిక్షా కార్మికులకు రగ్గులను పంపిణీ** పంపిణీ చేసిన హైదరాబాద్ వలికర్లపాలెం యాక్షన్ టవర్స్ నిర్వాహకులు హైదరాబాద్ వలి తన తండ్రి మాజీ సైనికుడు అబ్దుల్ రజాక్ జ్ఞాపకార్ధం కర్లపాలెంలోని రిక్షా కార్మికులకు చలికాలంను పురస్కరించుకుని రగ్గులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వలి మాట్లాడుతూ మానవ సేవయే దేవుడి సేవగా భావించి పేదలకు సేవ చేస్తున్నామన్నారు.కరోనా సమయంలో గిరిజనులకు అన్నదానం,అగ్నిప్రమాదంలో గృహాలు కాలిపోయిన వారికి నిత్యావసర సరుకులు, సామాగ్రి,దుప్పట్లు, పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠశాలలకు కుర్చీలు,రేకలు, వేసవి కాలంలో మజ్జిగ, మంచినీటి చలివేంద్రం, పోలీసులకు హెల్మెట్ లు తదితర సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వలి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాష,బాజి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News