నేటి సాక్షి,బాపట్ల ప్రతినిధి పేదవారికి సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అనేక మంది పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి అన్నారు. బెస్తపాలెం కు చెందిన షేక్ మాసు అనారోగ్య కారణంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కుటుంబ పోషణ కోసం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బండ్రెడ్డి గోపి మాట్లాడుతూ పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో షాపులో గుమస్తాగా పని చేసే షేక్ మాసు వెన్నుపూస ఇబ్బందితో ఆరోగ్యశ్రీ పథకంపై ఆపరేషన్ చేయించుకున్నారన్నారు. ఎటువంటి పని లేకపోవడంతో కుటుంబ పోషణకు ఆర్థిక భారం కావడంతో తమ సభ్యులు బాధితుడికి సహాయం చేయాలని కోరగా పూర్తిస్థాయిలో సమాచారం తెలుసుకొని షేక్ మాసు కు ఆర్థిక సహాయం చేశామన్నారు. ప్రత్యేకంగా తమ సభ్యుడు ఇనపగోళ్ళ రంగారావు మరో రెండు వేలు అదనంగా అందించారని, కార్యక్రమం కు సహకరించిన ప్రతి ఒక్క సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి బత్తుల సురేష్, కోశాధికారి సువర్ణ రాజు, మద్దిబోయిన గోపి, బికె రమేష్,బండి శ్రీనివాసరావు, యలవల శ్రీనివాసరావు, బండ్రెడ్డి అంకమ్మరావు, యర్రంశెట్టి పవన్, పెద్దమళ్ళు శ్రీకాంత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.





