నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 12 ~అన్నమయ్య జిల్లా :-: విశాఖ నగర పరిధిలో పెద్ద ఎత్తున భూ పందేరం నడుస్తుందని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్ నాథ్ ధ్వజమెత్తారు. ఏపీలో రూపాయికి, అర్థ రూపాయికి భూ కేటాయింపులు చేస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కూడా భూములు ఇలానే ఇస్తున్నారానని నిలదీశారు. కేవలం ఏపీలోనే రూపాయికి, అర్థ రూపాయికి భూ కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయం నుంచి గుడివాడ అమరనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో భూ పందేరంలో భాగంగానే ఈ తరహా కేటాయింపులు జరగుతున్నాయని విమర్శించారు. తమ హయాంలో ఏ కంపెనీకి రూపాయికి భూములు ఇవ్వలేదన్నారు. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పరిశ్రమ వైయస్ఆర్సీపీ హయాంలోనే వచ్చిందన్నారు.నాడు జగన్ ఏం చెప్పారో – చంద్రబాబు అదే..__________________________విశాఖ గురించి నాడు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏం చెప్పారో నేడు చంద్రబాబు కూడా అదే చెబుతున్నారన్నారు. విశాఖ అనేది మన రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని జగన్ ఏనాడో చెప్పారు. ఇప్పుడు అదే మాట చంద్రబాబు కూడా చెప్తున్నారు. 2014లో విశాఖను చంద్రబాబు ఎందుకు గుర్తించలేకపోయారన్నారు. ‘ రాష్ట్రానికి పరిశ్రమల రావడమనేది ఒక కంటిన్యూ ప్రాసెస్. విశాఖకు ఇన్ఫోసిస్ లాంటి గొప్ప ఐటీ పరిశ్రమ తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. ఇన్ఫోసిస్ లాంటి సంస్థ విశాఖ వచ్చింది కాబట్టే మిగతా ఐటీ పరిశ్రమలు విశాఖ నగరానికి తరలివస్తున్నాయని గుడివాడ అమరనాథ్ అన్నారు. టీసీఎస్ విశాఖ రావడానికి జగన్ చేసిన శ్రమ ఎంతో ఉంది. పెద్ద కంపెనీలకు భూమి ఇవ్వడంలో తప్పులేదు. రియల్ ఎస్టేట్ సంస్థలకు కారుచౌకగా భూములు కట్ట బేడుతున్నారు. సత్వ, కపిల్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల భూములను తక్కువ రేటుకు ఎందుకు ఇస్తున్నారని గుడివాడ ప్రశ్నించారు. మీకు నచ్చిన సంస్థలకు రూపాయి అర్ధ రూపాయికి ఇస్తామంటే ఎలాగని సత్వకు ఇచ్చిన భూమిలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, ప్లాట్స్ కట్టుకోమని ఎలా అనుమతులు ఇస్తారని గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూమి తక్కువ రేటుకు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ రాయితీలు ఇస్తారా. లూలు సంస్థ గుజరాత్ రాష్ట్రంలో ఎకరా భూమి కోట్లాది రూపాయలకు కొంటారు. మన రాష్ట్రంలో నామ మాత్రపు ధరకు ఎలా కట్టబెడతారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారని లోకేష్‌ను ప్రమోట్ చేయడం కోసం ప్రభుత్వ ధనంతో ప్రచారం చేస్తున్నారని ప్రకటనల్లో కనీసం పరిశ్రమల శాఖ మంత్రి ఫోటో కూడా వేయడం లేదని గుడివాడ విమర్శించారు. వైఎస్ జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానంటే మునిగిపోతుందని వార్తలు రాశారని గుడివాడ అమరనాథ్ దుయ్యబట్టారు. చంద్రబాబు విశాఖను అభివృద్ధి చేస్తానంటే ఆహా ఓహో అంటూ వార్తలు రాస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ తో పాటు భారత ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసేవారు. నేడు ప్రకటనల్లో మోదీ, పవన్ ఫోటోలు చుక్కలా మారిపోయాయనని గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు..~~~~~~~~~~~~~~~~





