Thursday, March 19, 2026

ఎన్నికల ముందు బెల్ట్ షాపులపై దాడులు చేసిన టాస్క్ ఫోర్స్

నేటి సాక్షి,నల్లబెల్లి ,డిసెంబర్ 12 : ఎన్నికల ముందు అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు విస్తృత చర్యల్లో భాగంగా టాస్క్ ఫోర్స్ బృందం లెంకల్ పల్లి గ్రామంలో దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కిరాణా వ్యాపారి మమిడ్లపల్లి రాజు ఇంటిపై దాడి జరిపి రూ.10,670 విలువైన ఐఎంఎఫ్‌ఎల్‌ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుంది. రాయల్ స్టాగ్, ఐబీ, ఆఫీసర్ ఛాయిస్, కింగ్‌ఫిషర్ లైట్ వంటి వివిధ బ్రాండ్ల సీసాలు పెద్ద ఎత్తున లభ్యమవడం అధికారులు ఎన్నికల సమయంలో అక్రమ చర్యలపై మరింత అప్రమత్తత అవసరాన్ని సూచించింది.దాడి అనంతరం నిందితుడిని స్వాధీనం చేసిన మద్యం సహా నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో అక్రమాలకు చోటు లేకుండా చర్యలు తీసుకుంటామని ఏసీపీ మధుసూదన్, ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్‌ఐ వీరస్వామి,టాస్క్ ఫోర్స్ బృందం స్పష్టం చేసింది.ప్రజలు కూడా అక్రమాలకు దూరంగా ఉండి ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నది అధికారుల సందేశం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News