నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………………..టిపిసిసి సేవాదళ్ సెక్రెటరీ బోగోజి ముఖేష్ కన్నా ఆధ్వర్యంలో కాంగ్రెస్ సేవాదళ్ ఆన్లైన్ మెంబర్షిప్ కార్యక్రమాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి,డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య లు ప్రారంభించారు.*ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ*కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ ఆర్గనైజేషన్ చాలా కీలకమైనదని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పార్టీ కార్యక్రమాలను క్రింది స్థాయి వరకు తీసుకెళ్లేది కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలేనని సేవాదళ్ సభ్యత్వం లో కార్యకర్తలు ముందుండాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను పేద ప్రజలకు అందే విధంగా సేవా సేవాదళ్ కార్యకర్తలు కష్టపడాలని వారు పిలుపిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల రాజేందర్, నాయకులు దేవనపల్లి రాజేందర్, నాగభూషణం,మహేందర్,వినయ్ రాకేష్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.





