నేటి సాక్షి,బాపట్ల జిల్లా (బాపట్ల రూరల్)విద్యార్థులకు సరైన ఆహారం అందించకపోతే చర్యలు తప్పవు అని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు.బాపట్ల మండలం స్టువర్టుపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాల ను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలకు మెను ప్రకారం పెడుతున్నారా అని నేరుగా పిల్లలను అడిగి తెలుసుకున్నరూ.మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన విద్యార్థులు రోజూ కోడి గుడ్డు పెట్టడం లేదని, ఇప్పటివరకు స్వీట్ అసలు పెట్టలేదని ఎమ్మెల్యే దృష్టికి విద్యార్థులు తీసుకువచ్చారు.అదే విధంగా చాలీచాలకుండా భోజనం పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. వెంటనే ప్రిన్సిపల్ సోమయ్య పై బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మండిపడ్డారు. ప్రభుత్వం చిన్నపిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు.ఈ సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రిన్సిపాల్ సోమయ్య పై కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించడంలో ఉద్యోగులు విఫలమయ్యారని విచారం వ్యక్తం చేశారు.చిన్న పిల్లలకు స్నాక్స్, స్వీట్, రాగి లడ్డు అసలు పెట్టడంలేదని, మిగిలిన ఆహారం చాలీచాలకుండా పెడుతున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసికెళతానన్నారు.ఆయన వెంట అధికారులు,నాయకులు తదితరులు ఉన్నారు.





