Thursday, March 19, 2026

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం..!– కోటి సంతకాల సేకరణలో విద్యార్థి సంఘమే కీలకం– 15న జరిగే మహా ర్యాలీని విజయవంతం చేయాలి– విద్యార్థి సంఘం నేతలకు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పిలుపు

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్‌ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టడం దుర్మార్గమని రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్‌ మండలం తుమ్మల గుంటలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్యవిద్యను దూరం చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తప్పుబడుతూ జగనన్న ఇచ్చిన పిలుపుతో సైన్యంలా కదిలిన పార్టీ కార్యకర్తలు, విద్యార్థి విభాగం నేతలు అనుకున్న సమయానికి కోటి సంతకాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి కోటి కంటే ఎక్కువగానే సంతకాలు సేకరించారంటే ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాన్ని ప్రజలు ఎంతలా వ్యతిరేఖిస్తున్నారో పాలకులు గుర్తించాలన్నారు. *15న జరిగే ర్యాలీని విజయవంతం చేయండి*కోటి సంతకాల సేకరణలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సేకరించిన సంతకాల పత్రాలను అన్ని నియోజకవర్గాల నుంచి జిల్లా పార్టీ కార్యాలయంకు ఇప్పటికే చేర్చడం జరిగిందన్నారు. అయితే ఈనెల15వ తేదీన తిరుపతి నగరంలోని పద్మావతీపురంలో వున్న జిల్లా పార్టీ కార్యాలయం నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంకు సంతకాలు పూర్తి చేసిన పత్రాలను పంపడం జరుగుతుందన్నారు. భారీ ర్యాలీగా ఆ కార్యక్రమంను నిర్వహించాలని పార్టీ పెద్దలు నిర్ణయించినందున ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి విద్యార్థి విభాగం నాయకులు తప్పక హాజరుకావాలన్నారు. తమ వద్దనున్న వాహనాలతో తిరుపతి పద్మావతీపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంకు చేరుకోవాలన్నారు. *విద్యార్థి విభాగం నేతలకు ధన్యవాదాలు*కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో యూనివర్శిటీలు, కాలేజీల చుట్టు తిరిగి పెద్ద ఎత్తున విద్యార్థులను చైతన్య పరచి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరించిన విద్యార్థి విభాగం నేతలు అందరికీ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సంతకాల సేకరణలో విద్యార్థులదే కీలకమైన పాత్ర కావడంతో ఆ విభాగం బాగా పనిచేసిందని, భవిష్యత్తులో కూడా ఇలాగే విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News