నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 13కాగజ్ నగర్ మండలంలోని రేగులగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ గా సుశీలభాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్ గా సోయం లచ్చు,మరో ఐదుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు, గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో వారంతా డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ కండువా కప్పుకొని బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ,సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ ఇతర వార్డు సభ్యలందరికి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులతో పాటు ప్రపంచ దేశాల్లో పని చేస్తున్న ఎన్జివోల సహాయం కూడా తీసుకొని ఆదర్శ గ్రామపంచాయితీగా తీర్చిదిద్దుతామని మాటిచ్చారు. సిర్పూర్ మార్పే నా ధ్యేయంగా పని చేస్తానని స్పష్టం చేశారు. ఇసుక,కలప,భూ దందాల వంటివి నాకు లేవని నేను కేవలం సిర్పూర్ ప్రజల అభివృద్ధి కోసమే వచ్చానన్నారు. అనంతరం కోసిని గ్రామపంచాయితీలో పర్యటించారు. సర్పంచ్ అభ్యర్థి వసాకె పుల్లభాయి బంతి గుర్తుకే ఓటేయాలని కోరారు. మిత్ర కాలనీలో ఇళ్లకు పట్టాలు రావాలన్నా,మిషన్ భగీరథ నీరు,కరెంట్ రోడ్డు సమస్యలు తీరుస్తామని మాటిచ్చారు. చింతగూడ కోయగూడ గ్రామ పంచాయితీలో తమ అభ్యర్థి లక్ష్మిని గెలిపించాలని కోరారు. ఇంతవరకు చింతగూడ కార్యకర్తలతో కలప దందా,ఇసుక దందా,మట్టి దందా చేసుకోవడానికి వాడుకున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపిస్తే ఈ గ్రామానికి దొంగల నుండి విముక్తి లభిస్తుందన్నారు. దరిగాం గ్రామపంచాయితీలోని ఎన్జివోస్ కాలనీలో ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థి కన్నయ్యను గెలిపిస్తే రోడ్లను కబ్జా చేసిన దొంగలను రోడ్డుకు ఈడ్చి,పేదలకు న్యాయం చేస్తామన్నారు. కరెంట్ మిషన్ భగీరథ,కరెంట్ స్తంభాలు వేయిస్తామని హామి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, ఉద్యమకారులు,సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ, వసాకె హన్మంత్,మినాజ్,పోషం,బాబర్,మహమూద్,కన్నయ్య,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





