నేటి సాక్షి గోదావరిఖని (రమేష్ )సామాజిక సేవను బాధ్యతగా భావిస్తూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త మార్షల్ దుర్గం నగేష్ (నాగేశ్వరరావు)కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక లభించింది. అమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆయనను డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్తో సత్కరించింది.సామాజిక సేవ రంగంలో ఆయన చేసిన విశిష్ట కృషిని గుర్తించి ఈ గౌరవాన్ని ప్రకటించినట్లు యూనివర్సిటీ అధికారికంగా వెల్లడించింది. చెన్నైలో ఘనంగా కాన్వొకేషన్గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వార్షిక కాన్వొకేషన్ కార్యక్రమం డిసెంబర్ 13, 2025న చెన్నైలో నిర్వహించగా, అదే వేదికపై దుర్గం నగేష్ ( నాగేశ్వరరావు)కు డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డా. పి. మాన్యువెల్ తో పురస్కారాన్ని అందజేశారు.విద్య, ఆరోగ్యం, పేదల సంక్షేమం, హక్కుల సాధన, సామాజిక న్యాయం వంటి రంగాల్లో గత కొన్నేళ్లుగా దుర్గం నగేష్ (నాగేశ్వర రావు) చేస్తున్న సేవా కార్యక్రమాలు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ వేదికల దృష్టిని కూడా ఆకర్షించాయని. బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పలు సంస్థలతో నగేష్ కలిసి చేపట్టిన కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పును తీసుకొచ్చాయని కొనియాడారు.అసాధారణమైన సామాజిక సేవా దృక్పథంతోప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే నిబద్ధతతో పని చేస్తున్న వ్యక్తికి ఇవ్వబడుతున్న అత్యున్నత గౌరవమే ఇది అని యూనివర్సిటీ బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు.సందర్భంగా దుర్గం నగేష్ ,( నాగేశ్వరరావు) మాట్లాడుతూ… నాకు మాత్రమే కాదు సమాజ మార్పు కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి సేవాకారునికి లభించిన గుర్తింపు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ కి, గత 20 సంవత్సరాలుగా చేస్తున్న సేవలను గుర్తించి నాకు ఇప్పించిన డా . మహమ్మద్ ఆరిఫ్ ఉద్దీన్ కు, తనను కన్న తల్లిదండ్రులకు సహకరిస్తున్న సతీమణి ప్రమీలకు, సమతా ఫౌండేషన్ సమతా సైనికుల సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇది నాకు మరింత బాధ్యతను గుర్తు చేస్తోంది అని అన్నారు.సామాజిక సేవకు అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచిన డాక్టరేట్, మార్షల్ దుర్గం నగేష్ సేవా ప్రస్థానానికి మరో మైలురాయిగా నిలిచింది. డాక్టరేట్ పొందిన దుర్గం నగేష్ ను పలువురు ప్రజా సంఘాల నాయకులు స్వచ్ఛంద సేవకులు ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు.-





