నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………….. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఆయా ప్రాంతాలకు ఎన్నికల సామాగ్రిని పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య తరలించడం జరిగిందని రూట్ మొబైల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు రెండో విడతకి సంబంధించి 1276 పోలింగ్ కేంద్రాలలో, 134 సర్పంచ్, 946 వార్డులకు పోలింగ్ జరుగుతుంది అని దీనికి సంబంధించి 853 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు అని అన్నారు.పటిష్ట ఎస్కార్ట్ తో పోలింగ్ సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరిగింది . 57 రూట్స్ లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని స్పెషల్ సైక్లింగ్ ఫోర్స్ సైక్లింగ్ ఫోర్ టీమ్స్ మరియు ఎస్ ఐ లతో పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఓటరు స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రలోభాలకు తావు లేకుండా ప్రతి ఓటరు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునే ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఓటర్లు ఎవరు కూడా సెల్ ఫోన్లు, మందు గుండు సామాగ్రి, ఇంకు బాటిల్స్,వాటర్ బాటిల్స్, పోలింగ్ బూత్ లోనికి తీసుకువెళ్లరాదని, సెల్ఫీలు దిగడం నిషేధం అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యఫలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు ఎన్నికల సంఘం చే జారీ చేయబడిన నియమాలను పక్కాగా అమలు చేస్తామన్నారు.ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)అమల్లో ఉందని, కావున విజయోత్సవ ర్యాలీలు, సభలు,బైక్ ర్యాలీలు, డీ జే లు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అన్నారు.MCC అమల్లో ఉన్నందున ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలని,నియమాలను అతిక్రమించే ఏ చర్యనైనా సహించేది లేదని ఉల్లంఘనలు జరిగితే వెంటనే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు.





