సర్పంచుల ఫోరం- బిఆర్ఎస్ పార్టీ కైవసం…సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా మరాఠీ మల్లిక్…చందుర్తి మండల కేంద్రంలో శనివారం రోజున బిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య ఆధ్వర్యంలో సమావేశమై ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులు చందుర్తి మండల సర్పంచుల ఫోరం మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులు- మరాటి మల్లిక్, ఉపాధ్యక్షులు- నరాగుల వాణి గంగస్వామి,ప్రధాన కార్యదర్శి-కొక్కుల నరేష్, కోశాధికారిగా- కపిల శంకర్, కార్యదర్శి భూక్య మోహన్, సహాయ కార్యదర్శి-ఎండి సహనాజ్ సమీర్. కార్యవర్గ సభ్యులు ,చిలక మర్లేశ్వరి అంజి బాబు, అసినపర్తి శోభా సుధాకర్, పోతరాజు భారతి , మందాల శారద అబ్రహం లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్ రావు మాజీ ఏఎంసి చైర్మన్ డప్పుల అశోక్ మాజీ ఎంపీటీసీ దగ్గర్ల రమేష్ రావు మాజీ సర్పంచ్ లు కమలాకర్ రావు, దుమ్మ ఆనంద్, భైరవని రమేష్ గుంటి గంగాధర్ గొల్లపల్లి పరశురాం ఆకుల ఎల్లయ్య గంగరాజు శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.





