Thursday, March 19, 2026

మండల.సమైక్య.అధ్యక్షురాలు సర్పంచ్ అభ్యర్థి.అధికారులను బోల్తా కొట్టిస్తూ నామినేషన్.రాజీనామా చేయకుండానే ఎన్నికల బరిలో అభ్యర్థిపట్టించుకోని కొమరం భీం జిల్లా అధికారులు

నేటి సాక్షి కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 13కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం లోని కుకుడ గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల బరిలో దిగిన ఒక సర్పంచ్ అభ్యర్థి ఏకంగా ప్రభుత్వ అనుబంధ సంస్థలో ఉద్యోగిగా ఉంటూ, నిబంధనలను ఉల్లంఘిస్తూ అధికారులను బోల్తా కొట్టించడం గమనార్హం.కుకుడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తేటి శ్రీదేవి అనే మహిళ సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే, ఆమె ప్రస్తుతం ఐకేపీ (మహిళా సమైక్య కార్యాలయం) లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేసేవారు ఎన్నికల్లో పోటీ చేయాలంటే తప్పనిసరిగా తమ పదవికి రాజీనామా చేయాలి.అయితే, శ్రీదేవి మాత్రం తన ఉద్యోగానికి సంబంధించిన రాజీనామా పత్రాలను లిఖితపూర్వకంగా అధికారులకు సమర్పించకుండానే నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.ఉద్యోగులు ఎన్నికల ప్రచారం చేయకూడదు, పోటీ చేయకూడదు అనే నిబంధనలు ఉన్నప్పటికీ, అధికార పార్టీ బలంతో ప్రభుత్వ కొలువు చేస్తూనే ఎన్నికల బరిలో దిగడం చర్చనీయాంశంగా మారింది.అధికారుల వివరణ: రాతపూర్వక రాజీనామా రాలేదుఈ విషయంపై ఐకేపీ కార్యాలయం ఏపీఎం (అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్) ను చరవాణి లో వివరణ కోరగా, తమ వద్దకు పూర్తేటి శ్రీదేవి నుంచి ఎటువంటి రాజీనామా పత్రం లిఖితపూర్వకంగా అందలేదని ఆయన స్పష్టం చేశారు.శ్రీదేవి ప్రస్తుతం ఐకేపీలో గ్రామస్థాయి అధ్యక్షురాలు మరియు మండల స్థాయి అధ్యక్షురాలుగా కూడా విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ విధంగా ఒక ప్రభుత్వ అనుబంధ పదవిలో ఉంటూ, నిబంధనలను అతిక్రమించి సర్పంచ్ పదవికి నామినేషన్ వేసి, అధికారులను తప్పుడు దారి పట్టిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.కుకుడ గ్రామపంచాయతీ ఎన్నికలు ఒకే పార్టీలో రెండు వర్గాలు, మరియు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మూడవ అభ్యర్థి పోటీ పడటంతో రసవత్తరంగా మారిన నేపథ్యంలో, నిబంధనలను ఉల్లంఘించి నామినేషన్ వేసిన శ్రీదేవిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు వేచి చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News