నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 13 ~అన్నమయ్య జిల్లా :-: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల అంధ్రప్రదేశ్ మారుస్తున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు అప్పులే పరమావధిగా చేస్తున్నారని విమర్శించారు. ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని బొత్స ప్రశ్నించారు. శనివారం విశాఖపట్నం నుంచి మీడియాతో బొత్స మాట్లాడుతూ ‘ చంద్రబాబు 18 నెలల కాలంలో 2 లక్షల 66 వేల కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారు. వైయస్ఆర్సీపీ హయాంలో చేసిన అప్పులకు లెక్కలు చెప్పాము. మరి కూటమి పాలనలో చంద్రబాబు చేసిన అప్పులకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదన్నారు. వైయస్ఆర్సీపీ హయాంలో చేసిన అప్పులతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, పోర్ట్లు, ఆర్బీకేలతో పాటు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామని చంద్రబాబు చేసిన అప్పులు పారదర్శకంగా ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబు ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు..~~~~~~~~~~~~~~~~





