నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 13 ~అన్నమయ్య జిల్లా :-: చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్‌లో రహస్యంగా జరుగుతున్నాయని పైరవీలు, ప్రలోభాలన్నీ అక్కడే చేయిస్తుంటారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాన్ని కూడా పాండిచ్చేరిలోని హోటళ్ల కు చేర్చారని నెల్లూరు 54 డివిజన్లలో మొత్తం వైయస్ఆర్సీపీనే గెలుపొందిందని అలాంటి చోట ఏమాత్రం బలం లేకున్నా ఎలా గెలవాలని చూస్తున్నారంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు. ” వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారని రాజ్యాంగబద్దంగా అవిశ్వాస తీర్మానం మీద ఎన్నిక జరిగితే వైయస్ఆర్సీపీనే గెలుస్తుందని కిడ్నాప్‌లు చేయటానికి ఖాకీలను వాడుకుంటున్నారని కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు ఖాకీ క్యాబ్ సర్వీసులుగా మారారని కొందరు పోలీసులు బిఎన్ఎస్ చట్టాలు అంటే ‘బాబు అన్యాయ సంహిత’ చట్టాలుగా మార్చారంటూ నాగార్జున యాదవ్ దుయ్యబట్టారు. ”టీడీపీకి బలమే వుంటే వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం దేనికని నాగార్జున యాదవ్ ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నైతికంగా ఎప్పుడో ఓడిపోయింది. అధికార బలం ఎల్లవేళలా పని చేయదు. చంద్రబాబు అనైతిక రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టే రోజు వస్తుందని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు..~~~~~~~~~~~~~~~~





