Thursday, March 19, 2026

*మేడిపల్లి సర్పంచ్ కడారి రాజేష్‌కు ఘన సన్మానం**

నేటి సాక్షి – మెట్ పల్లి*( రాధారపు నర్సయ్య )మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కడారి రాజేష్ గ్రామ సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కడారి రాజేష్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు, జిల్లా కార్యదర్శి రాజేందర్, బీజేపీ ఐటీ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ మిట్టపల్లి సాయికుమార్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్లు సుఖేందర్ గౌడ్, సంకు సుధాకర్, తెడ్డు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.*బిజెపి పార్టీ తరపున సహకరిస్తాం*ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ, మేడిపల్లి గ్రామ అభివృద్ధికి బీజేపీ పార్టీ తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆశలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సర్పంచ్ కడారి రాజేష్‌కు సూచించారు.____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News