నేటి సాక్షి,నల్లబెల్లి ,డిసెంబర్ 13 : గోవిందపురం కాంగ్రెస్ అభ్యర్థి వాసం తిరుపతమ్మ సాంబయ్యను రాష్ట్ర మంత్రి సీతక్క నల్లబెల్లి మండలం గోవిందపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని కలిసి యోగక్షేమాలను తెలుసుకొని తన ఆశీర్వాదాలను అందజేశారు.సీతక్క గ్రామానికి చేరుకున్న వార్త తెలుసుకున్న వెంటనే గ్రామస్తులు, బంధువులు ఆమెను కలుసుకోవడానికి పోటీపడ్డారు.గ్రామంలో సీతక్కకు దగ్గరి బంధువులు ఎక్కువగా ఉండటంతో ఆమె రాకతో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై మాట్లాడిన సీతక్క, బంధువులను దగ్గరికి తీసుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు.సీతక్క రాకను తెలుసుకున్న గ్రామ మాజీ ఎంపీటీసీ జిల్లా మునీందర్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటరాజు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాలోతు రమేష్ సీతక్కను కలుసుకున్నారు.అధిక సంఖ్యలో మహిళలు, యువత, గ్రామస్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సీతక్క పర్యటన గ్రామంలో కొత్త ఉత్సాహం, ప్రేరణను నింపిందని గ్రామస్తులు పేర్కొన్నారు.





