Thursday, March 19, 2026

పత్రిక ప్రకటనకొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతేదీ : 14/12/2025

నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ *గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం లాంటి చర్యలకు అనుమతి లేదు* *గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కి లోబడి ఉండాలి.* *నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరిక* *విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు కొరకు సంబంధిత అధికారులు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే జరుపుకోవాలి* జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని, ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ నితికాపంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ—లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు మరియు ఎలాంటి అసాంఘిక చర్యలు చోటుచేసుకోకుండా చూసేందుకు మొత్తం 862 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బంది విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు.లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో భద్రత కోసం ప్రత్యేక బందోబస్తు, క్యూ.ఆర్.టి టీంలు, స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎస్పీ గారు ప్రజలకు, అభ్యర్థులకు, గెలిచిన వారిని ఉద్దేశించి ముఖ్య సూచనలు జారీ చేశారు—👈ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పనిసరిగా పాటించాలి.👈 ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చటం, ఊరేగింపులకు ఎలాంటి అనుమతి లేదు.👈 శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు పూర్తిగా నిషేధం.👈 జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని, గొడవలు అల్లర్లు సృష్టించే వారిని, నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే వారిపై రిమాండ్ లోకి తీసుకోవలసి ఉంటుందని తెలిపారు.👈 ర్యాలీలు లేదా ఊరేగింపులు నిర్వహించుట కొరకు సంబంధిత అధికారుల ఉత్తర్వుల మేరకు వారు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే జరుపుకోవాలి. 👈ఎవరైనా నియమావళిని ఉల్లంఘిస్తే, లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే, ప్రజలందరూ శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని, ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని ఎస్పీ నితిక పంత్ గారు విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News