జిల్లాలోనిచరిత్ర సృష్టించిన వేంపల్లి గ్రామం పదికి పది’ కాంగ్రెస్ కైవసంజిల్లా దృష్టిని ఆకర్షించిన వేంపల్లి గ్రామంఎమ్మెల్సీ దండే విట్టల్ కృషి ఫలితం 100కు 100% ఇది ప్రజల విజయం. దండేవిటల్నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 14కొమరం భీం జిల్లా. కాంగ్రెస్ పార్టీకి అరుదైన ఘన విజయం రాజకీయాలలో వేంపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి. 100కు 100% గెలుపు. రాష్ట్రంలోనే ఎన్నడూ లేని విధంగా సిర్పూర్ (టి) మండలంలోని ఈ గ్రామపంచాయతీలో మొత్తం పదికి పది స్థానాలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.సర్పంచ్ విజయం సహా ఒకటో వార్డు నుండి పదో వార్డు వరకు, మరియు సర్పంచ్ స్థానంతో కలిపి మొత్తం పది స్థానాలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం. జరిగింది. జిల్లా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ అనూహ్య విజయంపై ప్రస్తుతం కొమరం భీం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.కొత్త నాయకత్వం కాంగ్రెస్ బలపరిచిన లెందుగురే సత్తయ్య సర్పంచిగా విజయం సాధించారు. వీరితో పాటు ఎన్నికైన పదిమంది వార్డు సభ్యులలో ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. మొదటి ప్రయత్నంలోనే ఇంతటి సమగ్ర విజయాన్ని సాధించడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.ఈ ఎన్నికల ఫలితాలు సిర్పూర్ (టి) మండలంలోని వేంపల్లి గ్రామపంచాయతీపై జిల్లా రాజకీయ నేతలు ప్రత్యేక దృష్టి సారించేలా చేశాయి. ఈ విజయం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని అందిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ప్రత్యేక కృషి ఎమ్మెల్సీ దండే విటల్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సత్యం, మరియు కార్యకర్తల కృషి ఎంతగానో ఉంది అని ప్రజలు విశ్వసిస్తున్నారుపార్టీ శ్రేణులు ఈ విజయాన్ని నిజమైన విజయం గా పేర్కొంటూ సంబరాలు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ దండే విట్టల్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు ప్రజలు తమపై నమ్మకం ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వలన ఈరోజు ఇంత పెద్దన 100% ప్రజలు మాకు ఆశీర్వాదం ఇచ్చారు వారికి ఎల్లవేళలా పూర్తి సహాయ సహకారం గ్రామపంచాయతీ అభివృద్ధికి తోడ్పడుతామని హామీ ఇచ్చారు ఈ విజయం వేంపల్లి గ్రామ.ప్రజలకు అంకితం అని అన్నారు





