Thursday, March 19, 2026

*మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ శ్రీ మిక్కిలినేని మను చౌదరి గారికి వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ * కుత్బుల్లాపూర్ డిసెంబర్15:

(నేటి సాక్షి)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం సర్వేనెంబర్ 329/2-329/10 లో గల 130 ఎకరాల పట్టాభూమి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో అంటే 2016 వ సంవత్సరం నుండి ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు.ఈ విస్తీర్ణంలో ఉన్న భూమి 1975 లో శాలివాహన బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మహాదేవపురం కాలనీ లేఔట్ గా అప్పటి గ్రామ పంచాయతీ తీర్మానంలో ఆమోదం పొందడం జరిగింది.అలాగే అప్పటి రేవన్యూ అధికారులు 1967 సంవత్సరం నుండి అందజేసిన పహాని కాపీలు మరియు రేవన్యూ సంబంధిత పత్రాలతో గౌరవ న్యాయస్థానం హైకోర్టును సంప్రదించారు అనంతరం మహాదేవపురం వెల్ఫేర్ సొసైటీ కాలనీ యజమానులకు అనుకూలంగా హైకోర్టు న్యాయస్థానం తీర్పునిస్తూ రిజిస్ట్రేషన్ మరియు పర్మిషన్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతూ వచ్చింది. కానీ ప్రతి ప్లాట్ యజమాని వారి యొక్క అవసరం నిమిత్తం ప్లాట్ క్రయ విక్రయాల కోసం అలాగే ఇంటి పర్మిషన్ కోసం గౌరవ న్యాయస్థానాన్ని సంప్రదించడం అనేది చాలా వ్యయ ప్రయాసాలతో పాటు అధిక సమయం పట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందాని ఈరోజు ఉదయం మహాదేవపురం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,కాలనీవాసులు షాపూర్ నగర్ లో *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * కలిసి వారి సమస్యలను తెలియజేసిన వెంటనే సానుకూలంగా స్పందించారు..ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మహాదేవపురం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులతో కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్ళి గౌరవ కలెక్టర్ శ్రీ మిక్కిలినేని మను చౌదరి కి వినతిపత్రం అందజేసి త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరడమైనది..అనంతరం జిల్లా గౌరవ కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో పర్యవేక్షింపజేసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, ప్రసాద్ దుగ్గాల, రామచంద్రారెడ్డి, రంగారావు, జగదీశ్వర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు, ప్లాట్ యజమానులు మరియు కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్ తో తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News