Thursday, March 19, 2026

*మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి – ఎంపీ గురుమూర్తి*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)రాష్ట్రంలోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి అన్నారు. *పార్లమెంటు ఆవరణలో వైసీపీ ఎంపీలు మెడికల్ కాలేజీల ఉద్యమ చిత్రాలను చూపుతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి, లోక్ సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిధున్ రెడ్ది, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్ది, మద్దిల గురుమూర్తి, అయోధ్యా రామిరెడ్డి, గుమ్మా తనూజా రాణి పాల్గొన్నారు.*అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడాతూ ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా 500 పడకల ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ విభాగాలు, పారామెడికల్ కోర్సులు కూడా ప్రారంభించేలా సమగ్రంగా మౌలిక వసతులు కల్పించారని తెలిపారు. కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా జిల్లా స్థాయిలోనే ప్రజలకు వైద్యం అందించాలనే గొప్ప లక్ష్యంతో ఈ కాలేజీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి లాభార్జనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ గురుమూర్తి విమర్శించారు. ప్రజల పన్నుల డబ్బులతో నిర్మించిన కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే విధానాన్ని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరన్నారు.ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల ఉద్యమం చేపట్టామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున సంతకాలు చేసి, భారీ ర్యాలీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారని చెప్పారు.ఈ నెల 18వ తేదీన తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ని కలిసి ప్రజలు పెద్ద ఎత్తున చేసిన సంతకాలు అందజేస్తారని ఎంపీ గురుమూర్తి తెలిపారు. అలాగే ఇప్పటికే పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి గారిని కలిసి ఈ అంశాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లి, ప్రైవేటీకరణ చర్యలను ఆపాలని కోరినట్లు వెల్లడించారు.ప్రజల ఆరోగ్యం, వైద్య విద్య భవిష్యత్తు కోసం ప్రతి స్థాయిలో పోరాడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన ఈ పోరాటం కొనసాగుతుందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News