Thursday, March 19, 2026

ఎమ్మెల్యే సునీత రెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు” మెదక్ జిల్లా కొల్చారం

“నేటి సాక్షి (భూమయ్య).రంగంపేటలో “కాంగ్రెస్, బి ఆర్ ఎస్ కార్యకర్తల.* రంగంపేటలో ఉద్రిక్తత””మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన సోమవారం కొల్చారం మండలం రంగంపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గ్రామపంచాయతీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పాటలతో బతుకమ్మ ఆడుతూ ఉండగా రంగంపేటలో ఎన్నికల ప్రచారం కోసం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాన్వాయ్ వచ్చింది. ఎమ్మెల్యే కాన్వాయ్ కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుపడడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.దీంతో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కారు నుండి దిగి నడుచుకుంటూ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం కోసం రంగంపేట కింది బజార్ వైపు వెళ్లారు. అయినప్పటికీ ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సమయానికి కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మోహినుద్దీన్ స్పందించి వర్గాలను తన సిబ్బందితో కలిసి నెట్టివేసి శాంతింపజేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News