నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 15పుంగునూరు నియోజవర్గం చౌడేపల్లి మండలం, ఆమినిగుంట సమీపంలోగల ప్రెట్రోల్ బంకు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మోహెంత్ (24) ఆమినిగుంట వైపు నుండి చౌడేపల్లి వైపుకు వేగంగా వస్తున్న ఏపి39ఆర్ సి 1875 నెంబర్ గల ద్విచక్రవాహనం లో చౌడేపల్లి సంతగేటు కు చెందిన మెహెంత్,చౌడేపల్లి వైపునుండి తిరుపతి వైపు వెళ్తున్న ఏపి03 ఎయల్ 8882 పుంగనూరు మండలం,బండ్లపల్లి గిరి ఒక్కసారిగా ఎడమవైపునుండి రోడ్డుకు అడ్డంగా కుడివైపుకు తిప్పడం వలన వేగంగా వచ్చిన వాహనం డీ కొట్టడంతో మెహెంత్(24) కు నోటి దవడ కు బలమైన గాయం అయ్యింది, రోడ్డు పైన రక్తం ఎక్కువగా పోయింది.అంతే కాకుండా గిరి(54) కూడా కన్నుపైన బలమైన గాయం తగలడం,సృహకోల్పోవడంతో స్థానికులు ఇద్దరిని,చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు.అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంబించారని తెలియజేశారు.





