నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………………..స్థానిక రామకృష్ణ డిగ్రీ &పీజీ కళాశాల మరియు మ్యాజిక్ బస్సు ఫౌండేషన్ సంయుక్తంగా కళాశాల ఆవరణలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ లొ వివిధ కళాశాలలకు చెందిన డిగ్రీ చివరి సంవత్సరం మరియు పూర్తిచేసిన విద్యార్థులు సుమారుగా 400 మంది పాల్గొన్నారు. 180 మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో తుది దశకు చేరుకున్నారు.ఈ క్యాంపస్ డ్రైవ్ లో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టెక్ మహీంద్రాతో పాటు మరో 8 బహుళ జాతి సంస్థలు పాల్గొని అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసినారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగాలు అందించుటకు ప్రతి సంవత్సరం తమ కళాశాల తరఫున ఇలాంటి క్యాంపస్ డ్రైవ్ ల నిర్వహణ జరుగుతోందని, ఈ ప్రాంత విద్యార్థులు ఐట్టి అవకాశాలను వినియోగించుకొని కార్పోరేట్ ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పల్లెర్ల నరేష్, ప్రిన్సిపాల్ కొక్కుల రాజేందర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ బి మల్లేష్ ,మ్యాజిక్ బస్సు ప్రతినిధులు పవిత్ర, శివ మరియు వివిధ కంపెనీల రిక్రూటర్స్ పాల్గొన్నారు.





