నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 15 ~అన్నమయ్య జిల్లా :-: లోక్‌సభ సాక్షిగా ఏపీ అప్పులు, కుంభకోణాలపై వైయస్ఆర్‌సీపీ రాజంపేట లోక్‌సభా పక్షనేత ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నిలదీశారు. ఈ మేరకు పార్లమెంటులో కొన్ని అంశాలను ఆయన ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి కేవలం 18 నెలల్లో ₹ 2.5 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందన్నారు. ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు ₹ 3 లక్షల 32 వేల కోట్లు మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ ఐదేళ్లలో కేవలం ₹ 3 లక్షల 32 వేల కోట్లు చేస్తే కూటమి ప్రభుత్వం 18 నెలల్లోనే ₹ 2.5 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందన్నారు. దీని సగటుగా తీసుకుంటే మరో మూడేళ్లలో ఎంత అప్పు చేస్తారు. తర్వాత అధికారాన్ని చేపట్టిన వాళ్లు ఎలా అప్పులు తీరుస్తారని ఇలా అప్పులు చేస్తూ పోతే ఆంధ్ర రాష్ట్రం అప్పులమయం కాక తప్పదని మిథున్ రెడ్డి విమర్శించారు. బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కూడా 9% వడ్డీకి ₹ 6000 కోట్ల అప్పులు సేకరిస్తున్నారనిప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ నిధి నుంచి డబ్బులు డ్రా చేసే అవకాశం కల్పించడం దారుణమని ఇది పూర్తిగా కుంభకోణమేనని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, అధిక వడ్డీకి అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపుతున్నారని మిథున్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్ని అప్పులు సీలింగ్ పరిధిలోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసిందని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పుల కోసం ప్రయత్నిస్తే సీలింగ్ విధించారని మరి 9% వడ్డీకి ఇప్పుడు అప్పులు తీసుకోవడానికి కేంద్రం ఎలా అనుమతించిందని మిథున్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపిస్తూ కేంద్రం ఏమైనా నిబంధనలను మార్చిందా అని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపివేయాలని ప్రభుత్వం చేతుల్లోనే వైద్యరంగం ఉండాలని లాభాపేక్షతో కూడిన ప్రైవేటుతో ప్రజలకు నష్టం జరుగుతుందని మిథున్ రెడ్డి వాపోయారు.₹ 2.66 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం వైద్య కళాశాలలను కాపాడలేదా..!—————————₹ 2.66 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం వైద్య కళాశాలలను కాపాడలేదా అంటూ మిథున్ రెడ్డి ప్రశ్నించారు. కడప – బెంగళూరు రైల్వే లైన్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. విశాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడటానికి గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ సొంత నియోజకవర్గంలో కూడా కూలీలకు వేతనాలు రాకపోవడంపై ఏం చేస్తున్నారో తెలియటం లేదని పేర్కొంటూ ఇది సిగ్గుచేతంటూ మిథున్ రెడ్డి అన్నారు..~~~~~~~~~~~~~~~~~~





