Thursday, March 19, 2026

*తంగడపల్లి సర్పంచ్‌గా పామెన రాములు ఘన విజయం*. *204 ఓట్ల మెజారిటీతో ప్రజల తీర్పు స్పష్టం*. *విజయం అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను కలిసి ఆశీస్సులు*. *గ్రామ అభివృద్ధే తొలి ప్రాధాన్యత అని పామెన రాములు వెల్లడి*

నేటి సాక్షి ప్రతినిధి చేవెళ్ల న్యూస్ చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పామెన రాములు ఘన విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీ అనంతరం ఆయన 204 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం సాధించి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు.ఎన్నికల ప్రచార కాలంలో గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, అందరికీ సమాన న్యాయం అనే అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకెళ్లిన పామెన రాములు, గ్రామ ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను వినిపించుకున్నారు. ఆయన సరళమైన స్వభావం, అందుబాటులో ఉండే నాయకత్వం ప్రజల్లో విశేష ఆదరణ పొందిందని గ్రామస్థులు తెలిపారు.ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. మద్దతుదారులు బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. విజయం అనంతరం పామెన రాములు మాట్లాడుతూ, “ఈ విజయం నాది కాదు, తంగడపల్లి గ్రామ ప్రజల విజయం. మీరు పెట్టిన నమ్మకాన్ని వృథా చేయకుండా గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తాను” అని అన్నారు.విజయం సాధించిన సందర్భంగా పామెన రాములు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య పామెన రాములును అభినందించి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామ అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు. తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పేదల సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసిన పామెన రాములు, ప్రజల సహకారంతో తంగడపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News