Thursday, March 19, 2026

అభిమానించి ఆరాధించే వారి కోసం ఎంత దూరమైనా సరే..!అనారోగ్యంతో బాధపడుతున్న బిల్లూరి వివేకానంద రెడ్డిని ఆత్మీయ పలకరింపుతో..! తంబళ్లపల్లి శాసనసభ్యులు టీడీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు దీటుగా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సవాల్..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 16 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన సోంపల్లి పంచాయతీ బిల్లూరివారిపల్లి గ్రామానికి చెందిన ములకల చెరువు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బిల్లూరి విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బిల్లూరి వివేకానంద రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్సనంతరం వారి స్వగృహంలో విరామం తీసుకుంటున్నారు. ఆయనను ఆత్మీయ పలకరింపు కోసం తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఆముదాల మధుసూదన్ రెడ్డి మంగళవారం ములకలచెరువు మండల వైసీపీ శ్రేణులతో కలిసి నేరుగా బిల్లూరి వారి పల్లి గ్రామానికి చేరుకొని విష్ణువర్ధన్ రెడ్డి స్వగృహానికి వెళ్లి వివేకానంద రెడ్డిని ఆత్మీయ పలకరింపుతో ఆరోగ్య స్థితిగతులను అడిగి విచారించారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించే యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు నిర్వహించిన చికిత్స వివరాల చిట్టాను చూశారు. వివేకానంద రెడ్డికి ధైర్యం చెప్తూ ఆరోగ్యం కుదుట పడే వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. బిల్లూరి విష్ణువర్ధన్ రెడ్డిని పలకరించి మీ కుటుంబానికి అండగా ఉన్నామని మనమంతా ఒకటేనని భరోసా కల్పిస్తూ నాన్న ఆరోగ్యం జాగ్రత్త అంటూ విష్ణువర్ధన్ రెడ్డికి సూచించారు. బిల్లూరి వివేకానంద రెడ్డి సోదరులైన బిల్లూరి నారాయణరెడ్డి, బిల్లూరి నాగేశ్వర్ రెడ్డి లను వాళ్ల కుటుంబ సభ్యులను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు అందించిన తేనీటి విందును స్వీకరించారు. తదనంతరం వైసీపీ శ్రేణులను ఆత్మీయ పలకరింపుతో పలకరించారు. సోమవారం రాయచోటిలో నిర్వహించిన ప్రజా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైసీపీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నా మాటకు అనుగుణంగా ఇన్ని వాహనాల్లో రాయచోటికి వచ్చినందుకు మీకు ఏమి చేసినా మీ రుణము తీర్చుకోలేనంటూ వేలాదిగా ఇతర వాహనాల్లో తరలివచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని ద్వారకానాథ్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేత చేసిన విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. బిరియాని ప్యాకెట్లకు మందు బాటిళ్లను చూపి జనాన్ని తోలారని టీడీపీ నాయకుడు చేసిన విమర్శలను ద్వారకానాథ్ రెడ్డి తిప్పి కొట్టారు. మీ పార్టీ అధినేత, చంద్రబాబ ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ ఎక్కడ సమావేశాలు పెట్టిన జనం హాజరు కాకపోవడంతో టీడీపీ నాయకులు ఓర్చు లేక మనకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక నిందలు మోపుతున్నారని రాయచోటికి అభిమానంతో వచ్చిన జనాలు అని ఏ ఒక్కరికి బిర్యానీ ప్యాకెట్లు, మందు పంపిణీ చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని నేను చేసిన సవాలును స్వీకరించి నిరూపించాలని లేకుంటే మీరు రాజకీయాల నుంచి రాజకీయ సన్యాసం తీసుకోవాలని ద్వారకానాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు క్షమించరు. అది మీకే ప్రమాదకరం. మీరు చేసిన వ్యాఖ్యలను ప్రజలంతా గమనిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే మిమ్మల్ని తుంగలోకి తొక్కి మీ పార్టీ అభ్యర్థులను ఓడించి వైసీపీ అభ్యర్థులను గెలిపించి ప్రజా సత్తా ఏంటో చూపబోతుందని ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ములకలచెరువు బూత్ కమిటీ అధ్యక్షుడు బోనాల చాంద్ భాష, వైసీపీ ప్రచార విభాగం ఉపాధ్యక్షుడు టంగుటూరి విశ్వనాథ్, ఉప సర్పంచ్ షంషాద్, ఎంపీటీసీ కృష్ణప్ప, కోనంగి శ్రీనివాసులు, కోనంగి ఈశ్వర, ప్రవీణ్ కుమార్, బి కే శ్రీనివాసులు, శంకర రవీంద్రబాబు, మధుసూదన్, సిద్ధ, సిద్దయ్య, కోటప్ప, చంద్ర, రామచంద్ర, ముస్లిం మైనార్టీ సోదరులు మున్వర్, అల్తాఫ్, సయ్యద్ భాష, ఖాసింఖాన్ తదితరులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News