Thursday, March 19, 2026

ప్రత్యర్థులను చిత్తు చేసిన అన్న–చెల్లెలు

నేటి సాక్షి ప్రతినిధి : డిసెంబర్ 16 శంకర్పల్లి న్యూస్ సంకేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల తీర్పుతో ప్రత్యర్థులను చిత్తుచేసి, ఘన విజయం సాధించిన అన్న–చెల్లెలు మరోసారి తమ సత్తా చాటుకున్నారు.5వ వార్డు నుంచి ఉప్పరి రవీందర్ సాగర్,6వ వార్డు నుంచి ఉప్పరి లావణ్య శ్రీనివాస్ సాగర్ఉప సర్పంచులుగా ఘనంగా విజయం సాధించడం గ్రామ రాజకీయాల్లో సంచలనంగా మారింది.అబద్ధపు ప్రచారాలు, అడ్డంకులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ప్రజల నమ్మకం, గ్రామ అభివృద్ధిపై ఉన్న నిబద్ధతే ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. వార్డు వార్డు ప్రజల మద్దతుతో, స్పష్టమైన మెజారిటీతో ప్రత్యర్థులకు రాజకీయ గుణపాఠం చెప్పారని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.ఈ విజయం వ్యక్తిగతం కాదు… ఇది సంకేపల్లి ప్రజల గెలుపు.గ్రామ ఐక్యతకు, నిజాయితీకి, అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు వేసిన ఓటుగా ఈ ఫలితాన్ని విశ్లేషిస్తున్నారు.ప్రజలు ఇచ్చిన బాధ్యతను మరింత నిజాయితీగా నిర్వర్తిస్తూ, సంకేపల్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్న–చెల్లెలు స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News