నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )ఒంటరిగా జీవిస్తున్న ఉద్యమ దివ్యాంగ నాయకుడు ఎండి ఫారుక్ మృతి చెందిన నేపథ్యంలో, ప్రజాప్రతినిధులు మరియు దివ్యాంగ సంఘాల నాయకులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆయన అంత్యక్రియలను సక్రమంగా నిర్వహించారు.*అనారోగ్యంతో మృతి*కోరుట్ల పట్టణానికి చెందిన ఉద్యమ దివ్యాంగ నాయకుడు ఎండి ఫారుక్ అనారోగ్యంతో సోమవారం రాత్రి జగిత్యాల సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒంటరిగా జీవిస్తున్న ఫారుక్ మృతి చెందడంతో, ఆయన అంత్యక్రియల నిర్వహణపై అనిశ్చితి నెలకొనగా, జిల్లా సీనియర్ దివ్యాంగ సంఘాల నాయకులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టారు.*ఎమ్మెల్యే ఆర్థిక సాయం*జగిత్యాల జిల్లా సీనియర్ నాయకుల చొరవతో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మానవతా స్పందన చూపుతూ రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సహకారంతో ఎండి ఫారుక్ అంత్యక్రియల కార్యక్రమాలు గౌరవప్రదంగా నిర్వహించగలిగారు. దివ్యాంగుల పట్ల తన అనుకూల దృక్పథాన్ని ఎమ్మెల్యే మరోసారి చాటుకున్నారు.*వైద్య సేవలకు ఎమ్మెల్సీ సహకారం*అలాగే నిన్న రాత్రి ఎమ్మెల్సీ యల్ రమణ (జగిత్యాల) సహకారంతో ఫారుక్కు అవసరమైన వైద్య సేవలు అందించడం జరిగింది. ప్రజాప్రతినిధుల సమయోచిత స్పందనతో దివ్యాంగ సంఘాల నాయకులు, సన్నిహితులకు భరోసా కలిగింది.*సంఘీభావం తెలిపిన నాయకులు*ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగ సంఘం సీనియర్ నాయకులు లంక దాసరి శ్రీనివాస్, అత్యంత చొరవ చూపిన అజ్గర్ మహమ్మద్ ఖాన్, వోడ్నాల శ్రీనివాస్ (కోరుట్ల), ఎండి ఫిరోజ్, ఇంతియాజ్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.____





