Wednesday, March 18, 2026

*నా వాళ్ళ కాంగ్రెస్ కు, జీవన్ రెడ్డి కి చెడ్డ పేరు వస్తే రాజీనామా చేస్తా – డి సి సి అధ్యక్షుడు నందయ్య*——————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………జగిత్యాల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సభ లోడీసీసీ అధ్యక్షుడు నందయ్యను నిలదీసిన జీవన్ రెడ్డి వర్గీయులు,ఎమ్మెల్యే సంజయ్‌తో నందయ్య సన్నిహితంగా కార్యక్రమాల్లో పాల్గొనడంపై అసంతృప్తిగా ఉన్నారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలోనే డీసీసీ అధ్యక్షుడిని ప్రశ్నించిన జీవన్ రెడ్డి వర్గం సభ్యులు.*డీసీసీ అధ్యక్షుడు నందయ్య ఘాటు వ్యాఖ్యలు*యువజన కాంగ్రెస్ నాయకులు నాపై నమ్మకం ఉంచాలి… ఇంకా నాకు ప్రొబేషన్ పీరియడ్ నడుస్తోంది, నా వల్ల జగిత్యాల కాంగ్రెస్‌కు లేదా జీవన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా, అధ్యక్ష పదవి కోసం కకృతి పడటం లేదు… రాజీనామా పత్రం జేబులోనే ఉంది, నా పదవి జీవన్ రెడ్డి ఇచ్చిన భిక్ష,ఆయనకు నందయ్య అంటే నమ్మిన బంటు అనే పేరు ఉంది, లూజ్ కామెంట్స్ చేయొద్దు,ఇష్టం లేకపోతే ఇదే స్టేజ్‌పై రాజీనామా చేసి వెళ్తా, జీవన్ రెడ్డి అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లను, ఈ పదవి ఉన్నా ఒకటే, పోయినా ఒకటే, అని DCC అధ్యక్షులు గాజంగి నందయ్య అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News