నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)* *రామచంద్రపురం*తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం గ్రామం దగ్గర తిరుపతికి చెందిన హరికృష్ణ ఇంజనీరింగ్ చదివిన యువకుడు పది సంవత్సరాలు అనేక సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసి గత రెండు సంవత్సరాలుగా వెంకట్రామపురం గ్రామం దగ్గర మూడెకరాల భూమిని లీజుకు తీసుకొని ప్రకృతి వ్యవసాయంలో అనేక ప్రయోగాలు చేసి ప్రతి మనిషికి నిత్యం అవసరపడే ఆకుకూరలు కూరగాయలు దాదాపు 20 రకాలు పంటలు పండిస్తూ యువతలకు ఆదర్శంగా నిలిచారు. మంగళవారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మరియు రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరణ మరియు శిక్షణ కొరకు, తిరుపతి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ షణ్ముగం వారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్ మరియు ఐ సి ఆర్ పి కు ఐదు రోజులు శిక్షణలో భాగంగా హరికృష్ణ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను 150 మంది ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలతో సందర్శించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రిందట తనకు వ్యవసాయం గురించి పూర్తిగా తెలియదని, తను పది సంవత్సరాలుగా దేశ ఇతర దేశాలలో పలు సాఫ్ట్వేర్ కంపెనీలలో పని చేశానని అన్నారు. తను వివిధ రకాల వ్యాపారాలు చేయాలని ఆలోచనలతో మొదలైనదే ప్రకృతి వ్యవసాయ సాగుతో పలు రకాల కూరగాయలు ఆకుకూరలు పండించే విధానాలకు శ్రీకారం చుట్టానన్నారు. ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయ గురించి అనేకమంది రైతులతో కలిశానని వారి యొక్క సూచనలు సలహాలతో వ్యవసాయాన్ని ప్రారంభించామన్నారు. తిరుపతిలో ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మే విధంగా షాప్లు ప్రారంభించాను అన్నారు. ప్రస్తుత కాలంలో కలుషితం లేని ఆహారం ప్రతి ఒక్కరికి అవసరమని, అలాంటి ఆహార ఉత్పత్తుల కొరకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. శిక్షణలో భాగంగా విచ్చేసిన ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలకు తన యొక్క సూచనలు విధానాలు తెలియపరిచారు. ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు వాళ్లు పండించే పంటలకు మంచి మార్కెట్ అందించగలరని భరోసా ఇచ్చారు. మొదట భూమిని సారవంతం చేస్తేనే మంచి దిగుబడి వస్తుందన్నారు. ముఖ్యంగా మనం ప్రకృతి వ్యవసాయ రైతులుగా కొనుగోలుదారులకు మంచి నమ్మకం కలిగించాలని సూచించారు. ఈ సందర్భంగా డిపిఎం షణ్ముగం మాట్లాడుతూ లక్షల్లో జీతం తీసుకుంటూ లగ్జరీగా జీవించే యువకుడు హరికృష్ణ ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రకృతి వ్యవసాయ రైతులు కార్యకర్తలు లకు మంచి మార్కెటింగ్ సదుపాయాలను హరికృష్ణ సమన్వయంతో పెద్ద ఎత్తున మన తిరుపతి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు పండించి మనం ఆర్థికంగా ఎదగడమే కాక ప్రజల ఆరోగ్యాలను భూమి ఆరోగ్యాన్ని కాపాడాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ హరికృష్ణ విధానాలను అలవరించుకొని జిల్లాలోని రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని తెలిపారు.ఈ ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పి బానుమూర్తి, మధు, నీలమ్మ, శ్రీదేవి, బాబాసాహెబ్,అయ్యప్ప నాయుడు, 150 మంది ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు పాల్గొన్నారు.





