Wednesday, March 18, 2026

లిటికేషన్ ఉన్న భూములను అధికార పార్టీ నేతలే కబ్జా చేయిస్తున్నారని ఆరోపణ..అధికార పార్టీ వాళ్లే కొన్ని చోట్ల లిటికేషన్ క్రియేట్ చేస్తూ అలజడి సృష్టిస్తున్నారని వైయస్ జగన్ ఘాటు విమర్శలు..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 16 ~అన్నమయ్య జిల్లా :-: విజయవాడలో వైయస్ జగన్ ను చూడటానికి భారీగా జనం తరలొచ్చారు. భవానీపురం జోజి నగర్‌లో ప్రభుత్వం కూల్చివేసిన 42 ప్లాట్స్ బాధితులను పరామర్శించేందుకు వైయస్ జగన్ భవానీపురం కు చేరుకున్నారు. జగన్ కాన్వాయ్ ముందు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, యువత భారీ ర్యాలీ చేపట్టి జననేతకు అడుగడుగునా జననీరాజనం పలికారు. అక్క చెల్లెమ్మలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. అందరికీ అభివాదం చేస్తూ జోజీనగర్ ప్రాంతాన్ని సందర్శించేందుకు విచ్చేశారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ లోని భవానీపురం ప్రాంతాన్ని పర్యటించారు. భవానీపురంలోని జోజీనగర్ లో ఎన్నో ఏళ్లుగా పునరావాసం ఉన్న 42 ప్లాట్లను ఇటీవల కూల్చివేశారు. గత వారంలో గన్నవరం విమానాశ్రయంలో భవానీపురం వాసులు వైయస్ జగన్ ను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. వాళ్ల గోడును విన్న వైయస్ జగన్ నేనున్నానంటూ ధైర్యం చెప్తూ మీకు అండగా నిలబడుతానని భరోసా కల్పించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పం మడమ తిప్పను అనే నానుడిని నిజం చేస్తూ మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి బాధితులను పరామర్శించారు. భవానీపురంలో ఇటీవల ఇళ్లను కోల్పోయిన 42 కుటుంబాల తరుపున ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని ఈనెల 31వ తేదీ వరకు 42 కుటుంబాలకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చిందన్నారు. అయితే పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఇళ్లను కూల్చేశారని 31వ తేదీ వరకు గడువున్నా అధికార దుర్వినియోగం చేసారని మండిపడ్డారు. ఇళ్లు కూల్చేసి 42 కుటుంబాలను రోడ్డుపాలు చేశారన్నారు. 2.17 ఎకరాల విలువ రూ.150కోట్లు పైగా ఉంటుందని 42 కుటుంబాలు 25 ఏళ్లుగా ఇక్కడే ఇళ్లు కట్టుకుని ఉంటున్నాయని వాళ్ల ఇళ్లను ధ్వంసం చేసారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. 2016లో 1981 డేట్ తో తప్పుడు డాక్యుమెంట్లతో తప్పుడు సొసైటీ క్రియేట్ చేసారని 2.17 ఎకరాలు కాజేసేందుకు కుట్ర చేశారన్నారు. ఇందులో మంత్రి నారా లోకేష్, కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ సోదరుడు ఇన్వాల్వ్ అయ్యారంటూ ఈ ఇళ్లకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి ఉందని వైయస్ జగన్ సూచించారు. బ్యాంకులు ఇళ్లు కట్టుకునేందుకు వీళ్లకు లోన్లు కూడా ఇచ్చాయని, స్థలం ఇంకొకరిదయితే రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని, అలాగే స్థలం ఇంకొకరిదే అయితే కరెంట్, డ్రైనేజ్ పర్మిషన్లు ఎలా ఇచ్చారని వైయస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని ప్రైవేట్ వ్యక్తులకు మద్దతిచ్చి జేసీబీలతో ఇళ్లు కూల్చేస్తారా అంటూ వైయస్ జగన్ ప్రశ్నించారు. స్థలం క్రమవిక్రయాలు జరిగే సమయంలో అభ్యంతరాలుంటే చెప్పమని పేపర్ ప్రకటనలు కూడా ఇచ్చారన్నారు. అయితే అప్పుడు ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్, కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ అంతా ఒక్కటై కుట్ర చేసారని జగన్ ఆరోపించారు. అన్యాయంగా పేదల ఇళ్లను కూల్చేశారని భవానీపురంలోనే కాదు ఇలాంటి అన్యాయాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని ఖచ్చితంగా వాళ్ళందరి ఉసురు కూటమి నేతలకు తగులుతుందని జగన్ విమర్శించారు. లిటికేషన్ ఉన్న భూములను అధికార పార్టీ నేతలే కబ్జా చేయిస్తున్నారని కొన్ని చోట్ల అధికార పార్టీ వాళ్లే లిటికేషన్ క్రియేట్ చేస్తున్నారని జగన్ మాట్లాడారు. భవానీపురం ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలని ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి పేద ప్రజల ఆస్తులపై ఎలా కన్నేశారో తేల్చాలని వైఎస్ జగన్ కోరారు.~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News