Wednesday, March 18, 2026

లింగాల పాఠశాలకు నవీన్ గౌడ్ మైకు బహుకరణ .

నేటి సాక్షి 16 లింగాల పాములపాడు :–పాములపాడు మండలం లింగాల గ్రామంలో ఎంపీపీ పాఠశాలకు మైకును మరియు స్పీకర్ బాక్స్ లను ఇప్పించడం జరిగిందని నవీన్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రేయర్ కు రిపబ్లిక్ స్వాతంత్ర దినోత్సవాల సందర్భాల మీటింగ్లలో ఉపాధ్యాయులు చెప్పే మాటలు విద్యార్థులకు సక్రమంగా వినిపించడం లేదని స్కూల్ చైర్మన్ శ్రీనివాస గౌడ్ కోరగా వెంటనే స్పందించి ఇప్పించడం మైకును బహుమతిగా ఇప్పించడమైనది.జరిగిందని ఆయన తెలిపారు నేను బాల్యంలో ఈ లింగాల గ్రామంలోని చదువుకున్నాను.ఈ స్కూలుకు ఈ విధంగా తోడ్పాటు అందించి సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని నవీన్ గౌడ్ తెలిపారు,ఆనందం వ్యక్తం చేశారు. నా కోరిక ఏమిటంటే పిల్లలకు మంచిగ చదువులు చదివితే మంచి మార్కులు వస్తేకూడా నేను బహుమతులు ఇస్తాను అంతేకాకుండా నా చిన్న ఆశ ఏమిటంటే మన ఊరిలో పిల్లలు మన పాఠశాలలో చదివి మంచి మంచి ఉన్నత మైన స్థానాలకు చేరుకోవాలని మరియు తల్లితండ్రుల కు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.అంతేకాకుండా మనం ఇతరులకు పంచేది జ్ఞానం ఒక్కటే అదే చదువు కన్నా గొప్పది ఈ లోకం లో ఏమిటి లేదు, కాబట్టి.మన ఊరు పాఠశాల పిల్లలు మంచిగ చదువుకొని మన ఊరికి జిల్లాకి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.అని తెలియపరిచారు.పాఠశాలకు మైకును బహుకరించినందుకు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు విద్యార్థులు నవీన్ కుమార్ గౌడుకు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News