నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)————————–చిత్తూరు (న్యూఢిల్లీ)16-12-2025—————————మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదలకు జీవనోపాధినిస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు.లబ్ధిదారుల ఖాతాలకు వేతన చెల్లింపులు చేస్తూ, వారికి భరోసా నిస్తోందన్నారాయన.పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చక్కగా అమలు చేస్తోందని కొనియాడారు.న్యూఢిల్లీ పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.., ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ..,భారత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు తక్షణం స్పందించి, లిఖిత పూర్వకంగా జవాబులు ఇస్తున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వివరించారు. ఇందులో భాగంగా మంగళవారం గత ఐదేళ్లలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులు, పంపిణీ చేసిన నిధుల మొత్తం వివరాలు, ఏ జిల్లాలకు ఎంత నిధులు విడుదల చేయబడ్డాయి? ఏ రకాల పనులు చేపట్టబడ్డాయి?అలాగే కెటాయించిన పనిదినాలు, బకాయిలు, ఎంత మంది పేదలు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అన్న అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని లిఖిత పూర్వకంగా, సంవత్సరంతో పాటు జిల్లాలవారికి తమకు అందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కమలేష్ పస్వాన్ కోరగా, ఇందుకు ఆయన తక్షణమే స్పందించి వివరాలను అందజేసినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. 2025-12-10వ తేదీ నాటికి, ఆంధ్రప్రదేశ్‌లో వేతన చెల్లింపు బకాయిలు ₹413.72 కోట్లు, సామగ్రి భాగానికి బకాయిలు ₹573.62 కోట్లు ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ఆయన చెప్పారు. డిమాండ్-ఆధారిత వేతన ఉపాధి పథకమైన MGNREGSపథకం పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. కేంద్రపాలిత ప్రాంతం-వారీగా నిధుల కేటాయింపు లేదని చెప్పిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, 2024-25-7,707.21 కోట్లు,2023-24-7,353.67 కోట్లు,2022-23-8,008.81 కోట్లు,2021-22-7,195.81 కోట్లు,2020-21-10,306.30 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించినట్లు కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ద్వారా తెలుస్తోందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు.





