నేటి సాక్షి, మానకొండూర్ : మానకొండూర్సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యురాలుగా ఎన్నికైన వారిని స్థానికులు స్థానిక రైస్ మిల్ ఏరియాలో మంగళవారం ఘనంగా సన్మానించారు. సర్పంచ్ తాళ్లపల్లి వర్షిని శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ బోడ సాయిశ్రీ రాజశేఖర్, వార్డు సభ్యురాలు దయ్యాల అభినయను పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తాళ్లపల్లి వర్షిని శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో మీకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేరుస్తానని ఇచ్చారు. ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహనతో ఉన్నాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పిట్టల మధు, మాజీ ఉపసర్పంచ్ నెల్లిమురళి, స్థానిక నాయకులు చౌదరి కనకయ్య, శ్రీపతి దామోదర్, సముద్రాల సంపత్, మర్రి పోశాలు, కోమటిరెడ్డి మల్లయ్య, గంగినేని నరసయ్య, చౌదరి కొమురయ్య, అల్లం రాజయ్య, అన్నేడి రాజిరెడ్డి, కొలకాని చంద్రమౌళి, కోలకాని కొమురయ్య, వజ్జపెళ్లి సత్తయ్య, చౌదరి సంపత్, సముద్రాల కొమురయ్య, శ్రీపతి దామోదర్, చౌదరి తిరుపతి, మెరుగు సాగర్, మెరుగు కుమార్, బుద్ధుల అనిల్ యాదవ్, పుట్టపాక శ్రీనివాస్, కోమటిరెడ్డి సతీష్, బుర్ర ప్రశాంత్ రెడ్డి, చౌదరి మహేష్, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.





