Wednesday, March 18, 2026

కూటమి ప్రభుత్వం దిగి రాకపోతే వైయస్ జగన్ తొలిగా రిలే దీక్ష ఆపై నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు వైసీపీ లో భారీగా చర్చ..ఈ విషయంపై ఇప్పటికే ఆయన పార్టీ సీనియర్లతో చర్చించినట్లు సమాచారం..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 17 ~అన్నమయ్య జిల్లా :-: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత కొన్ని నెలలుగా మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు (పీపీపీ) సైతం వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇటీవలే కోటి సంతకాల సేకరణ ప్రజల నుంచి చేపట్టి ఆ పత్రాలను వైసీపీ కార్యాలయాల్లో వుంచి ఈనెల డిసెంబర్ 18 రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతో భేటీ అయ్యి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా చేపట్టిన పత్రాలను అందజేయనున్నారు. ఈ విషయంపై అటు ఏపీ ప్రభుత్వం తో కూడా తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీల వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి ఆ ఉద్యమాల ద్వారా ప్రజలకు అసలు విషయాలను తెలియజేయడంతో పాటుగా ఇటీవలే పెద్ద ఎత్తున ప్రతి చోట వేలాది మందితో ర్యాలీలు కూడా చేపట్టారు. అలాగే ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలను గవర్నర్ కి అందచేయడం జరుగుతుంది. ఇటీవలే పార్లమెంట్ లో జరిగిన సభలలో కూడా వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నిరసన కూడా తెలియజేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటికరణం చేయకూడదని నిరసన చేపట్టారు. వైసీపీ వాళ్లు చేస్తున్న ఉద్యమానికి కూడా కూటమి ప్రభుత్వం దిగి రాకుంటే, వైయస్ జగన్ ఆమరణ నిరాహార దీక్ష లేదా రిలే దీక్ష మొదలుపెట్టే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. మొదట దశలో రిలే దీక్ష చేస్తారని ఆ తర్వాత నిరాహార దీక్ష మొదలుపెట్టబోతున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం వినిపిస్తోంది. ఈ విషయం పైన వైసీపీలో ఉండే సీనియర్ నేతలతో ఇప్పటికే వైయస్ జగన్ చర్చించినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం ప్రభుత్వానికి కొంత మేరకు లిక్ కావడంతో కొంత డైలమాలో పడేసేలా చేసింది. ఈ మధ్య తరచూ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పైన కూడా జగన్ ఏకధాటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటికరణ విషయంపై నిరాహారదీక్ష మొదలు పెట్టబోతున్నారనే విషయం వైసీపీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చిన, కూటమి ప్రభుత్వానికి పెద్ద చిక్కు తెచ్చేలా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. మరి వైసీపీ నేతలకు దీటుగా కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. వైయస్ జగన్ నిరాహార దీక్ష చేపట్టకనే అంతవరకు రానీయకుండా కూటమి నేతలు ఏదో ఒకటి తేల్చాల్సి ఉంది.. ~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News