నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 17, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పసుపుల గ్రామంలో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేస్తామని పసుపుల గ్రామ సర్పంచ్ నర్మద రవి గౌడ్ అన్నారు. బుధవారం మరికల్ మండల పరిధిలోని పసుపుల గ్రామానికి వెళ్లే స్టేజి నుండి గ్రామం వరకు వెళ్లే బీటీ రోడ్డు మరమ్మత్తులను గ్రామ సర్పంచ్ నర్మద రవి గౌడ్ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పసుపుల గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యలను దశరవారీగా తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామంలోని డ్రైనేజీలు గాని సిసి రోడ్లు గాని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు గాని పింఛన్లు గాని ఇందిరమ్మ ఇండ్లు గాని గ్రామంలో ఉన్న నిరుపేదలను గుర్తించి ప్రభుత్వ పథకాలను అందించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పసుపుల గ్రామ ఉపసర్పంచ్ మహేష్, బాలరాజు గౌడ్ నారాయణ రాజు ,చెన్నయ్య తుకారం ,విజయ్ రాజు ,ఎం .రాజు, నరేందర్ గౌడ్ ,భానుచందర్ యుగేందర్ రవి గౌడ్, పెద్ద నర్సింలు ,బాబురావు ,ఆనంద్, జోగురాజు, సతీష్ ,గణేష్ ,నరేష్ తదితరులు పాల్గొన్నారు.





