Wednesday, March 18, 2026

మరికల్ మాజీ ఉపసర్పంచ్ చెన్నకేశవ గౌడ్ అనారోగ్యంతో మృతి పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి….నారాయణపేట జిల్లాలోని మరికల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నకేశవ గౌడ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. బుధవారం నాడు ఉదయం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. చెన్నకేశవ గౌడ్ మృతి పట్ల గౌడ్ కుటుంబ సభ్యులను నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి పరామర్శించారు. కుంభం శివకుమార్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి, మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బెల్లగొంది వీరన్న, మరికల్ గ్రామ సర్పంచ్ గూప చెన్నయ్య, ఉప సర్పంచ్ గోరె కాజా, అఖిలపక్ష నాయకులు గ్రామస్తులు తదితరులు పరామర్శించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News