నేటి సాక్షి ,నారాయణపేట, డిసెంబర్ 17, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని మాదారం గ్రామ సర్పంచ్ గా రాయపోల మొగులన్న గెలుపొందడం జరిగింది. బుధవారం ఈ సందర్భంగా గ్రామ సర్పంచి మాట్లాడుతూ మాధవరం గ్రామం అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తానన్నారు. గ్రామంలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం మాధవరం గ్రామ సర్పంచ్ గా రాయప్పోల్ల మొగులన్న గెలుపొందడం పట్ల నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్. కొండన్న, వెంకట రాములు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.





