Wednesday, March 18, 2026

*డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో పెరుమాళ్ళపల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ కార్యక్రమం*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*వెదురుకుప్పం* మండలంలోని డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ తరపున స్పెషల్ క్యాంపును వెదురుకుప్పం మండలంలోని పెరుమాళ్ళపల్లి గ్రామంలో ప్రారంభోత్సవానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.అన్నపూర్ణ శారద, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సి.మంగళ గౌరీ,గ్రామ సర్పంచ్ బి.శశి ఆనంద రెడ్డి పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో మొదటి రోజు 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మరియు నలుగురు కమిటీ మెంబర్స్ క్లీనర్ గ్రీన్ కార్యక్రమాన్ని విడతల వారిగా గ్రామాన్ని శుభ్రపరచడం జరిగింది.కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ కమిటీ మెంబర్లు డాక్టర్ డి.లావణ్య కుమారి, డాక్టర్ వి.నాగేశ్వరరావు, మరియు వై. శ్రీనివాసులు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను క్రమ పద్ధతిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది.ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవ నీరతికి పెరుమాళ్ళపల్లి ప్రజలు హర్షం వ్యక్తపరిచారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News