Wednesday, March 18, 2026

మాతృమూర్తి ఆరోగ్యం పై ద్వారకానాథ్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ..!ఆమె దగ్గరుండి నిరంతరం పర్యవేక్షించిన – తంబళ్లపల్లి శాసనసభ్యులు..తనయుడితో కాసేపు ఆ మాతృమూర్తి ఓపెన్ హార్ట్..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 17 ~అన్నమయ్య జిల్లా :-: తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కి ఆయన తల్లి అంటే ఎనలేని ప్రేమ. ఆమెకు తనయుడంటే అంతులేని ప్రేమ. ఇటీవల ఆమె అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలో ఓ ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం కొంతమంది మేర కుదుటపడడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. నిరంతరం ఆమె వద్దనే ఉంటూ ఎప్పటికప్పుడు ఆ మాతృమూర్తి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ వైద్యులను విచారిస్తూ కంటికి రెప్పలా కాపాడారు. అటు పార్టీ కార్యక్రమాలను ఇటు మాతృమూర్తి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. ఆమె పూర్తిగా అనారోగ్య భారీ నుండి కోలుకోవడంతో బుధవారం మాతృమూర్తితో సరదాగా ముచ్చటించారు. ఆమె ఆరోగ్యం పట్ల నిరంతరం శ్రద్ధ వహిస్తూ కాపాడుకోరావడంతో బిడ్డపై ఎనలేని ప్రేమను కురిపిస్తూ ద్వారకా నాథుడి తో సరదాగా కాసేపు చిట్ చాట్ అయ్యారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News